మానవత్వం లేని మానవ మృగం కేసీఆర్..బండి సంజయ్ సంచలనం !

మానవత్వం లేని మానవ మృగం కేసీఆర్..బండి సంజయ్ సంచలనం !

మానవత్వం లేని మానవ మృగం కేసీఆర్ అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బిజెపి అంటే కేసీఆర్ కు డప్పులు కొడుతున్నాయి.. కేసీఆర్ బాక్సులు బద్ధలవుతున్నాయని ఆయన అన్నారు. ప్రజల పోరాటం ఫలితంగా సిర్పూర్ మిల్లు ప్రారంభించారు.. కానీ స్థానికులకు ఉద్యోగాలు రాలేదు...80 శాతం ఇతరులకు ఉద్యోగాలు ఇచ్చారని ఆయన అన్నారు. రెండు బర్రెలతో వచ్చిన వ్యక్తి, రెండువందల కోట్లు సంపాదించారు అని ఆయన అన్నారు. దుబ్బాకలో బిజెపి కొట్టిన దెబ్బకు కేసీఆర్ గూబ గుయ్యిమన్నదన్న ఆయన తెలంగాణలో తెరాస గడీల పాలన, రాక్షస పాలన అంతమొందించాలంటే బీజేపీతోనే సాధ్యమని అన్నారు.

కేసీఆర్ కి ఎమ్మెల్సీ అంటే మాస్టర్ ఆఫ్ లిక్కర్ కౌన్సిల్ అని అర్థం అని ఆయన అన్నారు. 35 వేల కోట్లతో ప్రాణహిత ప్రాజెక్టు మొదలుపెడితే లక్షకోట్లతో దోచుకునే ప్రాజెక్టు గా మార్చిండు. కమిషన్ ల కోసం కక్కుర్తిపడి ప్రాజెక్ట్ ల పేరుతో మోసం చేస్తున్నారని ఆయన అన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ కడతామని ఓ తట్ట మట్టి కూడా తీయలేదన్న ఆయన గిరిజనుల కోసం పోరాడి ప్రశ్నిస్టెంమా పై దాడి చేసి, అరెస్ట్ చేసి కేసులు పెడుతున్నారని అన్నారు. తెలంగాణలో రాక్షస రాజ్యం నడుస్తుందని తెలంగాణ కోసం అమరుల త్యాగం చేస్తే వారి త్యాగాల రక్తపు మడుగులో తెరాస రాజ్యమేలుతోందని అన్నారు.

తెలంగాణకు కాపలా కుక్కల ఉంటానన్న వ్యక్తి ఇవ్వాళ తెలంగాణకు విశ్వసఘాతకుడిగా మారాడన్న ఆయన సిర్పూర్ కాగజ్ నగర్ లో అభివృద్ధికి ఖర్చు చేసే ప్రతి పైసా కేంద్రం ఇచ్చే పైసానేనని అన్నారు. సిర్పూర్ అభివృద్ధి కోసం ఎంత నిధులు ఖర్చు చేశారో దమ్ముంటే శ్వేత పత్రం విడుదల చేయాలని అన్నారు. బిజెపి ఏ మతానికి వ్యతిరేకం కాదు. 80 శాతం ఉన్న హిందువుల కోసం పని చేస్తే, మతతత్వ పార్టీ అనే రంగు పూస్తున్నారని అన్నారు. 13వేల కంపెనీలు తెచ్చిన అని చెప్పుకునే వారికి నేను సవాల్ చేస్తున్న..ఆ 13 వేల కంపెనీల లిస్ట్ బయట పెట్టు...నేనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నీకు ఓటేయ్యమని ప్రచారం చేస్తామని ఆయన అన్నారు.

న్యాయవాది వామన రావ్ దంపతుల జంట హత్యల కేసులో ఇంతవరకు స్పందించకపోవడం శోచనీయం..వెంటనే సీఎం స్పందించాలని అన్నారు. బిజెపి ప్రభుత్వం ఏర్పాటు కోసం ఈ రాబోవు రెండు సంవత్సరాలు కష్టపడండి... మీ కోసం మేము కాపలాగా ఉంటామని అన్నారు. గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరటం ఖాయం అని బండి సంజయ్ పేర్కొన్నారు.