ఆందోళనకరంగా బండి సంజయ్ ఆరోగ్య పరిస్థితి...

ఆందోళనకరంగా బండి సంజయ్ ఆరోగ్య పరిస్థితి...

కరీంనగర్ జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. తనను సిద్ధిపేట వెళ్ళకుండా ఆపి అరెస్ట్ చేసి వెనక్కు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత బండి సంజయ్ నిరాహారదీక్ష ప్రారంభించినట్లు ప్రకటన చేసి స్వీయ నిర్బంధంలోకి వెళ్లి పోయారు. పార్టీ కార్యాలయంలోనే సంజయ్ దీక్షలో కూర్చున్నారు. కార్యాలయంలో ఒంటరిగానే సంజయ్ దీక్షకు కూర్చున్నారు. అయితే మరో పక్క ఎంపీ కార్యాలయం వద్ద పోలీసులు ఆయన్ని చేసిన అరెస్టుకు నిరసనగా  బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. అయితే ప్రస్తుతం బండి సంజయ్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. బండి సంజయ్ నిన్నటి నుంచి నిరసన దీక్ష కొనసాగిస్తున్నారు. అందువల్ల బండి సంజయ్ కి షుగర్ లెవెల్స్ తగ్గుతున్నాయి . అందువల్ల ఆయన ఆరోగ్యపరిస్థితిపై పార్టీ ముఖ్యనేతల ఆరా తీస్తున్నారు. అలాగే  పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్న కార్యకర్తల ఆందోళన ఆయన ఆరోగ్యం పై ఆందోళన చెందుతున్నారు.