గడికి పరిమితమైన కేసీఆర్ కు... ప్రజల గోడు కనిపించడం లేదు...

 గడికి పరిమితమైన కేసీఆర్ కు... ప్రజల గోడు కనిపించడం లేదు...


తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్‌ అయ్యారు. సీఎం కేసీఆర్, మంత్రులు అబద్ధాలు, అసత్య ప్రచారాలతో ప్రజలను మభ్యపెడుతూ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామిక విలువలు, హక్కులను ప్రభుత్వం పోలీసుల సాయంతో కాలరాస్తోందన్నారు. ఎల్ఆర్ఎస్ పై కలెక్టరేట్ల వద్ద నిరసన చేపట్టిన బీజేపీ నేతలు, కార్యకర్తల అరెస్టులు దారుణమన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో ఆశ పెట్టి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ మోసపూరిత వైఖరిని ప్రజలు గుర్తించారని పేర్కొన్నారు.  మున్సిపల్ ఎన్నికల్లో గట్టి సమాధానం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కరోనా సంక్షోభ సమయంలో ఎల్ఆర్ఎస్ భారం మోపడం ప్రభుత్వ అమానవీయ వైఖరికి నిదర్శనం? అని బండి సంజయ్‌ ఫైర్‌ అయ్యారు.

నిరసన అంటేనే తట్టుకోలేని అహంకారపూరిత వైఖరి కేసీఆర్ ది... కేసీఆర్ పాలనలో హక్కుల కోసం గొంతెత్తడం కూడా నేరమే అవుతోందన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామిక పాలన నడుస్తోందా... పోలీసు రాజ్యం నడుస్తోందా? గడీకి పరిమితమైన కేసీఆర్ కు... ప్రజల గోడు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నేతలు, కార్యకర్తలను రాత్రి నుంచే అరెస్టు చేస్తున్నారు. విచక్షణా రహితంగా దౌర్జన్యం ప్రదర్శిస్తున్నారని నిప్పులు చేరిగారు. ప్రభుత్వ నిర్బంధాల్ని, ఆంక్షలను దాటుకుని కలెక్టరేట్లకు చేరుకున్న నేతలు, కార్యకర్తలకు హ్యాట్సాఫ్ అని కొనియడారు.  బీజేపీ నేతలు, కార్యకర్తలు కరెక్టరేట్ల ముట్టడి విజయవంతంతో..... ఉద్యమ స్ఫూర్తిని చాటారని పేర్కొన్నారు.