నాగార్జున సాగర్ లో బీజేపీ గెలుపు ఖాయం : బండి సంజయ్‌

నాగార్జున సాగర్ లో బీజేపీ గెలుపు ఖాయం : బండి సంజయ్‌

నాగార్జునసాగర్ బీజేపీలో ఎలాంటి విభేదాలు లేవని  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు.  గెలిచేది బీజేపీ కాబట్టే.. తమ పార్టీలో  టికెట్ కోసం ఎక్కువ పోటీ ఉందని తెలిపారు.  టికెట్ తమకే రావాలని నాయకులు కోరుకోవడంలో తప్పులేదని..  టికెట్ ఎవరకి వచ్చినా కలసి పనిచేసుకోవాలని సాగర్ నేతలకు సూచించానని వెల్లడించారు.  సాగర్ నాయకులతో సమీక్ష తర్వాత గెలుపుపై మరింత నమ్మకం ఏర్పడిందని.. అక్కడి పరిస్థితులు తమకు అనుకూలంగా ఉన్నాయని నేతలు చెప్పారని పేర్కొన్నారు. నాగార్జున సాగర్ లో బీజేపీ గెలుపు ఖాయమని బండి సంజయ్‌ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌ అబద్దాలతో మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. పేదలు ఎప్పుడు డబ్బులకు అమ్ముడు పోరని... దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో డబ్బులకు అమ్ముడు పోలేదు.. బీజేపీకి ఓటు వేశారని తెలిపారు.   మూర్ఖత్వపు పాలనకు సమాధి పలుకుదామని పిలుపునిచ్చారు.