చిన్న పిల్లలకు హోం వర్క్‌ నిషేధం

చిన్న పిల్లలకు హోం వర్క్‌ నిషేధం

ఒకటి, రెండవ తరగతి పిల్లలకు హోం వర్క్‌ ఇవ్వడాన్ని మద్రాస్‌ హైకోర్టు నిషేధించింది. విద్యార్థులు వెయిట్‌ లిఫ్టర్లు కాదు....  అలాగే బ్యాగ్‌ లోడ్‌ కంటైనర్లూ కాదని   హైకోర్టు వ్యాఖ్యానించింది.నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చి అండ్‌  ట్రైనింగ్‌ (ఎన్‌సీఈఆర్‌టీ) సిఫారసుల మేరకు 1, 2 తరగతుల విద్యార్థులకు ఎలాంటి హోం వర్క్‌ ఇవ్వకుండా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతలకు ఆదేశాలు జారీ చేయాల్సిందిగా కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. విద్యా బోర్డులు, గుర్తింపు ఉన్నా లేకున్నా... అన్ని విద్యా సంస్థల్లో ఈ నిషేధాన్ని అమలు పర్చాలని పేర్కొంది. ఒకటి, రెండవ తరగతుల్లో కేవలం భాష, లెక్కలు మినహా ఇతర సబ్జెక్టులు  తప్పనిసరి చేయొద్దని కూడా జస్టిస్‌ ఎన్‌ కిరుబకరణ్‌ స్పష్టం చేశారు. మూడు నుంచి అయిదవ తరగతి వరకు పర్యావరణ శాస్త్రం వంటి మాత్రమే అదనంగా బోధించాలని తెలిపింది. అంతకుమించి సబ్జెక్టులు బోధించినా... హోం వర్క్‌ ఇచ్చినా.. సదరు స్కూలు గుర్తింపును రద్దు చేయాలని హైకోర్టు ఆదేశించింది.