బండి సంజయ్ ముక్కు నేలకు రాయాలి : బాల్క సుమన్

బండి సంజయ్ ముక్కు నేలకు రాయాలి : బాల్క సుమన్

ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మరోసారి బండి సంజయ్‌పై నిప్పులు చెరిగారు. సింగరేణి ప్రాంతంలో బిజెపి నేతలు దుర్మార్గపు మాటలు మాట్లాడారని.. సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వాలని కేంద్రాన్ని కోరితే అతిగతి లేదని ఫైర్‌ అయ్యారు.  కేంద్రం చేతుల్లో ఉన్న పని చేయకుండా..ఏదో చేస్తామని బిజెపి నేతలు భ్రమలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.  సింగరేణి వ్యవహారాలపై  సీబీఐ కాదు...సీబీఐ అయ్యా...సీబీఐ తాత ఎంక్వరీ చేసినా ఏం జరుగదన్నారు.  సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం టిఆర్ఎస్ సర్కార్ అనేక కార్యక్రమాలు చేపట్టిందని గుర్తు చేశారు. కేంద్రం నుంచి ఆదాయపు పన్ను మినహాయింపు ఇప్పించలేని బండి సంజయ్ ముక్కు నేలకు రాయాలన్నారు.   బండి సంజయ్ ఆధారాలతో మాట్లాడాలని...సిగ్గు లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఫైర్‌ అయ్యారు.