జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో బాలయ్య...!

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో బాలయ్య...!

జీహెచ్‌ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్‌ రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన విషయం తెలిసిందే. నామినేషన్లు కూడా ప్రారంభం అయ్యాయి. డిసెంబర్ 1న గ్రేటర్‌ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో గ్రేటర్‌ ఎన్నికలకు కౌంట్‌ డౌన్‌ మొదలైంది.  అధికార, విపక్షాలు గెలుపే లక్ష్యంగా ప్రచారాలకు సిద్ధం అవుతున్నాయి. అధికార పార్టీని ఢీ కొట్టేందుకు విపక్షాలు గట్టిగానే ప్రయత్నాలు ముమ్మరం అవుతున్నాయి. అటు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ కూడా విపక్షాలకు తగ్గట్టుగానే అస్త్రాలను తయారు చేసుకుంటున్నాయి. ఇక టీడీపీ విషయాన్ని వస్తే.. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పడు టీడీపీకి జీహెచ్‌ఎంసీలో తిరుగులేదు. ఆ టైమ్‌ లో అవలీలగా గెలిచిన టీడీపీకి.. ఇప్పుడు ఈ ఎన్నికలు పెద్ద సవాలుగా మారాయి. అయినప్పటికీ ఆత్మ విశ్వాసంతో టీడీపీ ముందుకు పోతోంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలిస్తే... టీడీపీ మళ్లీ పుంజుకుంటుందని పార్టీ నేతలు అనుకుంటున్నారట. టీడీపీకి పుర్వవైభవం తీసుకురావాలని నారా లోకేష్‌ జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారని సమాచారం. అయితే... లోకేష్‌ తో సహా బాలకృష్ణను కూడా గ్రేటర్‌ ప్రచారంలోకి దింపాలని టీడీపీ ఆలోచిస్తుందట. ఇందులో భాగంగానే ఇప్పటికే చాలా మంది నాయకులు బాలకృష్ణను కలిసి ప్రచారానికి రావాలని కోరారని తెలుస్తోంది. దీనిపై క్లారిటీ రావాలంటే మరో రెండు ఆగాల్సిందే.