బాలయ్య సహాయం చేశారు... కానీ... 

బాలయ్య సహాయం చేశారు... కానీ... 

బాలకృష్ణ సినిమా రంగంలో బిజీగా ఉంటూనే హిందూపురం ఎమ్మెల్యేగా తన కార్యక్రమాలు చక్కబెడుతున్నారు.  సమయం దొరికినప్పుడల్లా హిందూపురం నియోజక వర్గంలో పర్యటించి అక్కడి సమస్యలను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.  ఇటీవలే హిందూపురంలో పర్యటించిన బాలయ్య తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త పెనుబొల్లు తిమ్మారెడ్డిని కలిసి పరామర్శించారు.  కొంత కాలంగా అయన పక్షవాతంతో బాధపడుతున్నారు.  

ఇటీవలే ఆపరేషన్ చేయించుకున్న తిమ్మారెడ్డిని బాలయ్య పరామర్శించిన తరువాత, ఎమ్మెల్సీ ఇక్బాల్ కూడా వెళ్లి పరామర్శించారు.  అంతేకాదు, ఆయనకు తనవంతు సహాయం చేశారు.  ప్రభుత్వం తరపున సహాయం అందించేలా చూస్తామని హామీ ఇచ్చారు.  బాలయ్య వచ్చి పామర్శించినా ఎలాంటి సహాయం చేయలేదని, ఎమ్మెల్సీగా ఇక్బాల్ పార్టీలకు అతీతంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు సహాయం చేసారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.  ఇది తెలిసిన బాలయ్య వెంటనే తిమ్మారెడ్డికి 1.50 లక్షల రూపాయల సహాయం అందించి మంచి మనసును చాటుకున్నారు.  వైకాపా నాయకులు కలిసి సాయం చేసిన తరువాత తెలుగుదేశం పార్టీ నేతలు సహాయం చేస్తామని ముందుకు వచ్చారని, ప్రజలకు సేవ చేసే విషయంలో వైకాపా ఎప్పుడు ముందు ఉంటుందని చెప్పి సోషల్ మీడియాలో వైకాపా అనుకూల వర్గం నేతలు ప్రచారం చేసుకుంటున్నారు.  ఏదైతేనేం ఆపదలో ఉన్న కార్యకర్తకు సహాయం అందింది.  అంతకంటే  ఇంకేం కావాలి చెప్పండి.