కేసీఆర్‌కు నేనంటే కోపమా ? లేదే ! : బాలకృష్ణ

కేసీఆర్‌కు నేనంటే కోపమా ? లేదే ! : బాలకృష్ణ


మునుపెన్నడూ లేని విధంగా కామెంట్స్ చేసి నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారారు. ఎందుకంటే కరోనా కారణంగా అన్ని షూటింగ్ లు ఆగిపోవడంతో మళ్ళీ వాటిని ఎప్పుడు మొదలు పెట్టచ్చు ? మొదలు పెడితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాల మీద టాలీవుడ్ లో చిరంజీవి, నాగార్జున వంటి వారు తెలంగాణ మంత్రితో సమావేశం అయ్యారు. ఆ విషయాన్ని ఒక ఛానెల్ వారు బసవతారకం ఆసుపత్రిలో ఏదో కార్యక్రమంలో ఉన్న బాలయ్యను అడగ్గా ఆ సమయంలో తనను ఎందుకు పిలవలేదో తెలియదని అన్నారు. ఆ సమయంలో భూములు ఏమైనా పంచుకున్నారేమో అనడంతో అది వివాదానికి దారి తీసింది. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దాని గురించి ఆయన ప్రస్తావించారు.
అయితే కేసీఆర్ ను విమర్శించారు కాబట్టే ఆయన వద్దకు వెళ్ళేప్పుడు మిమ్మల్ని పిలవలేదేమో అని యాంకర్ అడగ్గా ఆయనపై చేసిన విమర్శల కారణంగా నన్ను పిలవకపోతే ఆ విషయం నాకు చెప్పాల్సిందని, కేసీఆర్‌గారికి నా మీద ఎప్పుడూ కోపం లేదు. రాజకీయం వేరు.. ఇది వేరని చెప్పుకొచ్చారు. రామారావుగారి అభిమానిగా నేనంటే కేసీఆర్ ‌గారికి ఎప్పుడూ వాత్సల్యం ఉందని మిగిలిన వాటి గురించి నేను మాట్లాడదలుచుకోలేదని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. అయితే కేసీఆర్ ఎన్టీఆర్ కు వీరాభిమాని అనే సంగతి తెలిసిందే. ఆయన కుమారుడు కేటీఆర్ కు కూడా పెద్దాయన పేరే పెట్టుకున్నారు. అదే 'తారక రామారావు' దానినే ఇప్పుడు జనం కుదించి కేటీఆర్ చేసేశారు.