హైదరాబాద్‌లో బాలయ్య న్యూ హౌస్!

హైదరాబాద్‌లో బాలయ్య న్యూ హౌస్!

నందమూరి బాలకృష్ణ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఓ ఖరీదైన ప్రాంతంలో రూ.15 కోట్లకు ఓ ఇంటిని ఈ నెల 11వ తేదీన కొనుగోలు చేశారట. ఇదివరకు బాలయ్య‌కు జూబ్లీహిల్స్ రోడ్ నంబ‌ర్ 1 లో పెద్ద భ‌వంతి ఉండ‌గా.. ఇది రెండోవ‌ది. రెండంతస్థుల ఆ ఇల్లు బాలకృష్ణ, ఆయన భార్య వసుంధర పేరు మీద రిజిస్టర్ అయిందట. లగ్జీరియస్‌గానే ఈ ఇంటిని డిజైన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. 

ఇక సినిమాల విషయానికి వస్తే బాలయ్య.. తన ఫేవరెట్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ  చివరి దశలో ఉంది. త్వరలోనే ఈ సినిమా టైటిల్ రివీల్ చేయనున్నారు. మే 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది. దీని తర్వాత ‘క్రాక్’ దర్శకుడు గోపీచంద్ మలినేనితో సినిమా చేయనున్నాడు నందమూరి హీరో. బాల‌కృష్ణ సినిమాల‌తో బిజీగా ఉండ‌టంతోపాటు హిందూపూర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా కొన‌సాగుతున్న విషయం తెలిసిందే.