లవర్స్‌కు వార్నింగ్.. బోసిపోయిన పార్క్‌లు..!

లవర్స్‌కు వార్నింగ్.. బోసిపోయిన పార్క్‌లు..!

ప్రేమికుల దినోత్సవంపై ఆర్ఎస్ఎస్, బజరంగ్‌దళ్‌ హెచ్చరికల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది... నిత్యం ప్రేమికులతో కళకళలాడే పార్కులు ఇవాళ బోయిపోయి కనిపిస్తున్నాయి.. ప్రేమికులు పార్క్‌లో కనిపిస్తే పెళ్లి చేస్తామని, పేరెంట్స్ ను పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తామని హెచ్చరించారు బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ నేతలు.. దీంతో హైదరాబాద్‌లోని ప్రముఖ పార్క్‌ల్లో ఎక్కడా ప్రేమ  జంటలు కనిపించడంలేదు.. నిత్యం సందడితో ఉండే పార్కులు... వాలెంటైన్ డే రోజు బోసిపోయాయి. ఇవాళ్టికి మాత్రం అంతా ఆన్‌లైన్‌లోనే ప్రేమికులు మునిగితేలుతున్నారని చెబుతున్నారు.. మరోవైపు.. ఈ హెచ్చరికల నేపథ్యంలో లవర్స్ తమ స్పాట్లు మార్చేశారు... రెస్టారెంట్లు, హోటళ్లలో కలిసి.. ప్రేమికుల దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు.