మార్కెట్లోకి సరికొత్త పల్సర్‌ నియాన్‌‌

మార్కెట్లోకి సరికొత్త పల్సర్‌ నియాన్‌‌

దేశీయ ద్విచక్ర వాహన ఉత్పత్తిదారు బజాజ్‌ ఆటో లిమిటెడ్‌ నూతన పల్సర్ నియాన్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. దీనిలో సరికొత్త హెడ్‌ల్యాంప్‌ బ్రౌస్‌, బ్యాడ్జెస్‌, సైడ్‌ప్యానెల్‌ మెష్‌, గ్రాబ్‌ రెయిల్‌ వంటివి అమర్చారు. 149సీసీ సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్‌ 8000 ఆర్‌పీఎం వద్ద 14బీహెచ్‌పీ శక్తిని, 13.4ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. దీనికి ముందుభాగంలో 240 ఎంఎం డిస్క్‌ బ్రేక్‌ , వెనుక చక్రానికి 130 ఎంఎం డ్రమ్‌ బ్రేక్‌ను అమర్చారు. నియాన్‌ రెడ్‌, నియాన్‌ ఎల్లో, నియాన్‌ సిల్వర్‌ రంగుల్లో అందుబాటులో ఉంది. ఢిల్లీ ఎక్స్‌ షోరూం ధర రూ.64,998గా కంపెనీ నిర్ణయించింది.