సిరీస్ ఇంగ్లాండ్ దే...

సిరీస్ ఇంగ్లాండ్ దే...

కరోనా విరామం తర్వాత వన్డే సూపర్ లీగ్ లో భాగంగా మొదటి అంతర్జాతీయ వన్డే సిరీస్ ఇంగ్లాండ్-ఐర్లాండ్ మధ్య జరుగుతుంది. మూడు మ్యాచ్ ల ఈ సిరీస్ లో జరిగిన రెండు మ్యాచ్ లో గెలిచి సిరీస్ సొంతం చేసుకుంది ఆతిధ్య ఇంగ్లాండ్ జట్టు. ఐర్లాండ్ నిర్ణిత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. కర్టిస్ కాంపర్(68) అర్ధసెంచరీ సాధించడంతో ఐర్లాండ్ 200 మార్కును దాటింది. ఇక 213 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగ్గిన ఇంగ్లాండ్ జానీ బెయిర్‌స్టో(82) రాణించడంతో 32.3 ఓవర్లలోనే 6 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని చేధించింది. సామ్ బిల్లింగ్స్(46), డేవిడ్ విల్లీ(47) పరుగులతో విజయంలో కీలక పాత్ర పోషించారు. ఐర్లాండ్ బౌలర్లలో జాషువా లిటిల్ 3 వికెట్లు, కర్టిస్ కాంపర్ 2 వికెట్లు అలాగే క్రెయిగ్ యంగ్ ఒక వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచ్ లో అద్భుతమైన అర్ధశతకం బాదడంతో బెయిర్‌స్టో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.