టీఆర్ఎస్ అభ్యర్థిని నిలదీసిన మహిళ.. డబ్బులు పంచుకుతిన్నారంటూ..!
గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారానికి వెళ్తున్న అభ్యర్థులకు చేదు అనుభవం ఎదురవుతోంది.. అభ్యర్థుల తరపున ప్రచారానికి వెళ్తున్న మంత్రులు, ఇతర నేతలకు కూడా అక్కడక్కడ ఇదే పరిస్థితి తప్పడంలేదు.. ముఖ్యంగా నేతలను నిలదీస్తుంది మాత్రం వరద బాధితులే.. భారీ వర్షాలు, వరదలతో భారీ నష్టాన్ని చవిచూసిన బాధితులు.. వచ్చిన డబ్బు కూడా తమకు అందకపోవడం.. మధ్యలోనే పరిహారం పంపిణీకి బ్రేక్ పడడంతో ఆగ్రహంతో ఉన్నారు.. ఇవాళ.. ఉప్పల్‌లో టీఆర్ఎస్ అభ్యర్థిని నిలదీశారు ఓ మహిళ.. డోర్ టు డోర్ క్యాంపెయిన్‌లో భాగంగా.. ఇళ్లిల్లు తిరిగుతూ ఓ షాప్‌కు వెళ్లారు ఉప్పల్ టీఆర్ఎస్ అభ్యర్థి అరటికాయల శాలిని భాస్కర్.. వరద సాయం పంచుకుతిన్నారు.. రూ. 25 లక్షలు.. రెండు గల్లీలకు చెందినవారే.. పెళ్లం, మొగుడు, కొడుకు ఇలా పంచుకు తిన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇక, ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని నిలదీసింది ఆ మహిళ.. సాయం అందకపోతే.. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సముదాయించే ప్రయత్నం చేశారు.. టీఆర్ఎస్ అభ్యర్థి.. అయినా ఆ మహిళ వినకపోవడంతో.. బర్రెకు గడ్డివేసి పాలు పితకాలి.. కానీ, దున్నపోతుకు గడ్డివేస్తే.. బర్రె పాలు ఇవ్వదంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు టీఆర్ఎస్ నేతలు.. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)