టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డికి చేదు అనుభ‌వం.. చెప్పులు విసిరిన రైతులు

టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డికి చేదు అనుభ‌వం.. చెప్పులు విసిరిన రైతులు

ఇబ్ర‌హీంప‌ట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిష‌న్‌రెడ్డికి చేదు అనుభ‌వం ఎదురైంది.. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లిలో ప‌ర్య‌టించారు ఎమ్మెల్యే మంచిరెడ్డి.. తాజాగా కురిసిన వ‌ర్షాల‌తో గ్రామంలోని చెరువు నిండ‌డంతో పూజ‌లు చేసేందుకు వెళ్లారు.. అలాగే.. వ‌ర్షంతో పంట న‌ష్ట‌పోయిన రైతుల‌ను ప‌రామ‌ర్శించారు. అయితే, అస‌లే ఫార్మాసిటీలో భూములు కోల్పోయిన బాధ‌లో ఉన్న రైతులు, గ్రామ యువ‌త‌.. మంచిరెడ్డి ప‌ర్య‌ట‌న‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.. కాన్వాయ్‌ని అడ్డుకోవ‌డానికి య‌త్నించారు.. పోలీసులు, గ్రామ‌స్తుల మ‌ధ్య తీవ్ర వాగ్వాగం జ‌ర‌గ‌గా.. ఆగ్ర‌హంతో ఊగిపోయిన స్థానికులు.. ఎమ్మెల్యే కాన్వాయ్‌పై చెప్పులు విసిరారు. 

ఎమ్మెల్యే మంచిరెడ్డి ప‌ర్య‌ట‌న దృష్ట్యా ముంద‌స్తు అరెస్ట్ చేశారు పోలీసులు.. గ్రామంలో భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.. జాతీయ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డితో పాటు కాంగ్రెస్ స్థానిక ప్రజా ప్రతినిధులను అరెస్ట్ చేశారు.. ఎమ్మెల్యే ప‌ర్య‌ట‌న‌కు వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌కు దిగిన మేడిప‌ల్లి రైతులు.. మా గ్రామానికి ఎమ్మెల్యే రావొద్దంటూ వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. కొంద‌రు గ్రామ స్థాయి నేత‌ల‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మేడిపల్లి గ్రామం ఫార్మాసిటీలో పోతుంది దీనికి కారణం ఎమ్మెల్యే మంచిరెడ్డి కార‌ణ‌మంటూ మండిప‌డుతున్న గ్రామంలో యువకులు.. ఎమ్మెల్యే మాఊరిలోకి రావొద్ద‌ని నినాదాలు చేశారు. ర్యాలీ నిర్వ‌హించారు.. ఇక‌, ఎమ్మెల్యే కాన్వాయ్ రావ‌డంతో అడ్డుకోవ‌డానికి య‌త్నించారు.. ఈ సంద‌ర్భంగా పోలీసులు, గ్రామ‌స్తుల మ‌ధ్య తీవ్ర‌వాగ్వాదం, తోపులాట జ‌రిగింది. ఆగ్ర‌హంతో ఊగిపోయిన రైతులు.. ఎమ్మెల్యే కారుపై చెప్పులు విసిరారు.. ఎమ్మెల్యే రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు.. ప‌రిస్థితి ఉద్రిక‌తంగా మార‌డంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు.. ఇక‌, అనంత‌రం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే మంచిరెడ్డి. ఫార్మాసిటీకి అనుమతిచ్చింది కేంద్ర ప్రభుత్వమే అన్నారు..