సెన్సార్ ప్రశంసలు అందుకున్న ‘బ్యాక్ డోర్’!

సెన్సార్ ప్రశంసలు అందుకున్న ‘బ్యాక్ డోర్’!

నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ దర్శకత్వంలో పూర్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘బ్యాక్ డోర్’. తేజ త్రిపురాన హీరోగా నటిస్తుండగా.. ఆర్చిడ్ ఫిలిమ్స్ పతాకంపై బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి ‘క్లీన్ యు’ సర్టిఫికెట్ ఇవ్వడమే కాకుండా.. దర్శకనిర్మాతలపై సెన్సార్ సభ్యులు ప్రశంసల వర్షం కురిపించారట. ఈ సందర్భంగా మాట్లాడిన చిత్ర యూనిట్.. ‘బ్యాక్ డోర్’ లో కుర్రకారును కట్టి పడేసే అంశాలతోపాటు అన్ని వర్గాలవారిని అలరించే అంశాలు మెండుగా ఉన్నాయని పేర్కొన్నారు. పూర్ణతో పాటు హీరో తేజ చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని.. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తామన్నారు.