పెంచిన తల్లి చెంతకే చిన్నారి తన్విత...

పెంచిన తల్లి చెంతకే చిన్నారి తన్విత...
చిన్నారి తన్విత కేసులో ఖమ్మం ఇదో మెట్రోపాలిటన్ కోర్ట్ కీలక తీర్పు వెల్లడించింది. పెంచిన తల్లికే తన్వితను ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. తుది తీర్పు వచ్చేవరకు పెంపుడు తల్లి వద్దే ఉంచాలని ఆదేశాలు జారీచేసింది. తన్విత పుట్టినప్పటినుంచి తనవద్దనే పెరిగిందని స్వరూప కోర్టులో తన వాదనలు వినిపించింది. మరోవైపు తన్విత కన్నతల్లి ఉమ సమర్పించిన అఫిడవిట్‌ పరిశీలించింది కోర్టు. అనంతరం పెంపుడు తల్లికి అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. కోర్టు ఉత్తర్వుల అనంతరం ప్రస్తుతం ఖమ్మం బాలల సదనంలో ఉన్న తన్వితను తన వెంట తీసుకు వెళ్లింది. మహబుబాబాద్ జిల్లా గార్ల మండలం చిన్న కిస్టాపురం గ్రామానికి చెందిన మాలోతు భావు సింగ్, ఉమ దంపతులకు తన్విత జన్మించింది. మహబుబాబాద్ లోని శ్రీ వెంకటేశ్వర నర్సింగ్ హోమ్ లో ఉమకు డెలివరీ అయింది. పురిట్లోనే పాపను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రొంపేడు గ్రామానికి చెందిన రాజేంద్ర ప్రసాద్, స్వరూప దంపతులకు దత్తత ఇచ్చాడు భావు సింగ్. భార్య ఉమకు మాత్రం పాప పురిట్లోనే చనిపోయిందని చెప్పాడు. పాప చనిపోలేదని తెలుసుకున్న ఉమ పాప తనకే కావాలని ఉమ గత నెలలో ఇల్లెందు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైన విషయం తెలిసిందే. కన్న తల్లి, పెంపుడు తల్లి మధ్య వివాదం పెద్దది అవడంతో పాపను ఐసిడిఎస్సీ గృహానికి తరలించారు. మరింత సమాచారం కోసం పైన వీడియోను క్లిక్ చేయండి.