బాబ్రీ తీర్పు: నిందితులంతా నిర్దోషులే...  

బాబ్రీ తీర్పు: నిందితులంతా నిర్దోషులే...  

1992 డిసెంబర్ 6 వ తేదీన అయోధ్యలోని బాబ్రీ మసీద్ కూల్చివేత కేసులో లక్నో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం కీలక తీర్పును వెలువరించింది.  బాబ్రీ మసీద్ కూల్చివేత ప్రకారం చేయలేదని, పధకం ప్రకారం చేశారని అనుకోవడానికి ఎలాంటి ఆధారాలు లేవని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం పేర్కొన్నది.  ఈ కేసులో నిందితులుగా అభియోగాలు మోపబడిన 49 మందిని నిర్దోషులుగా పేర్కొంటూ తీర్పు ఇచ్చింది.  1993 ఆగష్టు 27 వ తేదీన బాబ్రీ మసీద్ కూల్చివేతకు సంబంధించిన కేసును సీబీఐకు అప్పగించిన సంగతి తెలిసిందే.  2001 లో సీబీఐ కోర్టు కొంతమంది ప్రముఖుల పేర్లను తొలగించగా, 2017లో సుప్రీం కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసి, వారి పేర్లను కూడా చేర్చాలని, కేసును రెండేళ్లలో పూర్తి చేయాలనీ ఆదేశించింది.  అప్పటి నుంచి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం కేసును వేగవంతం చేసిన సంగతి తెలిసిందే.  ఈ కేసులో ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, కళ్యాణ్ సింగ్, ఉమా భారతి వంటి నాయకులను కూడా విచారణ చేసిన సంగతి తెలిసిందే.  ఈ కేసులో నిందితులుగా ఉన్న 49 మందిలో 17 మంది మరణించగా మిగతా వారిని కోర్టు విచారణ చేసింది.  కాగా, ఈరోజు తీర్పు వెలువరించబోతున్న సందర్భంగా అందరిని కోర్టుకు హాజరుకావాలని కోరింది. 27 మంది కోర్టుకు హాజరు కాగా, ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి వయసు రీత్యా హాజరు కాలేదు.  కళ్యాణ్ సింగ్, ఉమాభారతిలకు కరోనా కారణంగా మినహాయించారు.  28 సంవత్సరాలపాటు సుదీర్ఘంగా నడిచిన ఈ కేసు ఎట్టకేలకు ఈరోజుతో ముగిసింది.