జైల్ నుండి బిటెక్ రవి విడుదల.. ముందు ఆ కేసు చూడాలట !

జైల్ నుండి బిటెక్ రవి విడుదల.. ముందు ఆ కేసు చూడాలట !

టిడిపి ఎమ్మెల్సీ బిటెక్ రవి కడప సెంట్రల్ జైలు నుండి విడుదలయ్యారు. పులివెందుల కోర్టు  బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలు నుండి విడుదలయ్యారు. 2018లో పులివెందుల్లో జరిగిన  ఘర్షణ కేసులో బిటెక్ రవి పై నాన్  బెయిలబుల్ కేసు నమోదయింది. ఆ కేసు మీద ఆయనని చెన్నైలో అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకు వచ్చారు. 14 రోజులు కడప సెంట్రల్ జైల్లో రిమాండులో వున్నబిటెక్ రవి జైలు నుండి విడుదల అయ్యారు. ఇక సెంట్రల్ జైలు వద్ద మీడియాతో మాట్లాడిన బిటెక్ రవి టిడిపి నేతలను ఏదో ఒక రకంగా భయబ్రాంతులకు గురి చేసేందుకు అక్రమ కేసులు బనాయిస్తున్నారని అన్నారు. కేసులు మాకేమీ కోత్త కాదన్న ఆయన ఎన్ని కేసులు పెట్టినా ఎదు ర్కోనేందుకు సిద్దమేనని అన్నారు. చెన్నై ఎయిర్ పోర్టులో ముందు ఎస్సీ ఎస్టీ కేసులో అరెస్ట్ చేశామని  పోలీసులు చెప్పారని ఆ తర్వాత ఆ కేసు కాదు అల్లర్ల కేసు అని చెప్పారని ఆయన అన్నారు. ఉన్నత చదువులు చదివిన అధికారులు అబద్దాలు ఆడటం తగదన్న ఆయన రాష్ట్రంలోని టీడీపీ నేతలపై ఎస్సీ ఏస్టీ కేసులు నమోదు చేయించిన ఏకైక వ్యక్తి జగన్ అని అన్నారు. టీడీపీ నేతలపై ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాలని రాజారెడ్డి రాజ్యాంగంలో ఏమైనా ఉందా ? అని ప్రశ్నించిన అయన టీడీపీ నేతల అణిచివేతకై కెటాయించే సమయాన్ని  జగన్ రైతులపై దృష్టి పెట్టాలని అన్నారు. చిన్నాన్న వివేకా హత్య కేసును ఇప్పటికే తేల్చ లేక పోయావన్న ఆయన దానిపై దృష్టి సారించి ఆ కేసును తేల్చండని సలహా ఇచ్చారు.