ఏక్ రిలీజ్ డేట్... ‘అనేక్’ సినిమా!

ఏక్ రిలీజ్ డేట్... ‘అనేక్’ సినిమా!

బాలీవుడ్ లో కంటెంట్ సినిమాకి పోస్టర్ బాయ్... ఆయుష్మాన్ ఖురానా. ఆయన నటిస్తోన్న మరో యాంటిసిపేటెడ్ మూవీ ‘అనేక్’. అనుభవ్ సిన్హా దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా సెప్టెంబర్ 17న విడుదల కానుంది. ఇదే విషయాన్ని నిర్మాణ సంస్థ టీ సిరీస్ ట్విట్టర్ లో అధికారికంగా ప్రకటించింది. అనుభవ్ సిన్హాతో ఆయుష్మాన్ ఖురానాకు ‘అనేక్’ మూవీ రెండోది. వీళ్లిద్దరూ గతంలో ‘ఆర్టికల్ 15’ మూవీ చేశారు. ఆ సినిమాకి సూపర్బ్‌ రెస్పాన్స్ వచ్చింది. మంచి రివ్యూస్ లభించాయి. దాంతో ఆయుష్మాన్, అనుభవ్ సిన్హా సెకండ్ కొలాబరేషన్ పై హై ఎక్స్ పెక్టేషన్స్ నెలకొన్నాయి. 

‘అనేక్’ సినిమా ఫస్ట్ లుక్ తోనే ఆయుష్మాన్ ఖురానా అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఈసారి ఐబ్రో స్లిట్ తో ఆసక్తి రేకెత్తించాడు వెర్సటైల్ యాక్టర్. పైగా ‘అనేక్’ సినిమాలో ఆయుష్మాన్ క్యారెక్టర్ పేరు ‘జోషువా’. ఇలా డిఫరెంట్ నేమ్ అండ్ లుక్ తో ఆసక్తి రేపుతోన్న ‘అనేక్’ సెప్టెంబర్ లో రాబోతోంది. చూడాలి మరి, ‘ఆర్టికల్ 15’ కంటే పెద్ద సక్సెస్ ఈ హీరో అండ్ డైరెక్టర్ కొడతారో లేదో...