అయోధ్య రామ్ మందిర్ ఎప్పటికి పూర్తవుతుందటే... !!

అయోధ్య రామ్ మందిర్ ఎప్పటికి పూర్తవుతుందటే... !!

అయోధ్యలో రామ్ మందిర్ నిర్మాణానికి సంబందించిన భూమి పూజ ఈరోజు జరిగింది.  ప్రధాని మోడీ చేతుల మీదుగా పునాదిరాయిని వేశారు.  ఆలయ నిర్మాణానికి సంబంధించిన ప్లాన్ ఇప్పటికే సిద్ధంగా ఉన్నది.  అయోధ్య తీర్ధ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ఆలయ నిర్మాణం జరగబోతున్నది.  ఆలయానికి సంబంధించిన పాత మోడల్ ల్లో మార్పులు చేసి కొత్త ప్లాన్ ను సిద్ధం చేశారు.  మూడు అంతస్తుల్లో ఆలయాన్ని నిర్మించబోతున్నారు.  భూమి పూజ పూర్తయింది కాబట్టి చకచకా నిర్మాణం పనులను మొదలుపెట్టబోతున్నారు.  రామాలయం నిర్మాణానికి సంబంధించిన కూలీలను ఇప్పటికే సిద్ధం చేసి ఉంటారు.  రాబోయే మూడేళ్లలోగా నిర్మాణం పనులను పూర్తి చేయాలని అయోధ్య తీర్ధ క్షేత్ర ట్రస్ట్ లక్ష్యంగా పెట్టుకుంది.  2023 వరకు నిర్మాణాన్ని పూర్తి చేసి, 2023 ఆగష్టు 5 వ తేదీన ఘనంగా ప్రారంభోత్సవం చేయాలని లక్ష్యంగా పెట్టుకొని పనులు ప్రారంభిస్తున్నట్టు అయోధ్య ట్రస్ట్ తెలిపింది.