ఆ ఫార్ములా అనుసరిస్తే.. రామ్ మందిర్ కు ఐదేళ్ల పడుతుంది..
ఎన్నో ఏళ్లుగా అయోధ్య వివాదం కోర్టుల్లో నలుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వివాదానికి నిన్నటితో తెరపడింది. అయోధ్యలో వివాదాస్పదంగా ఉన్న 2.77 ఎకరాల భూమిని అయోధ్య ట్రస్ట్ కు ఇవ్వాలని సుప్రీమ్ కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో అక్కడ రామ్ మందిరం ఏర్పాటకు అని సిద్ధం అయ్యాయి. రామ్ మందిరంను రెండు అంతస్తుల్లో నిర్మించాలని ప్లాన్ చేశారు. 1990 వ సంవత్సరం నుంచి 250 మంది దీనిపై పనిచేసున్నారు.
మొత్తం 206 స్థంబాల నిర్మాణం అవసరం కాగా, ఇప్పటి వరకు 106 స్థంబాల నిర్మాణం మాత్రమే పూర్తయింది. ఇంకా వంద స్థంబాలు అవసరం ఉన్నది. ఇప్పటి నుంచి కళాకారులు నిర్విరామంగా రామ మందిరం నిర్మాణానికి పూనుకొని స్తంభాలను చెక్కడం మొదలుపెడితే.. కనీసం మరో ఐదేళ్ల సమయం పడుతుందని విశ్వహిందూ పరిషత్ సంస్థ చెప్తోంది. అయితే, మరో మూడు నెలల్లో ఈ వివాదాస్పద స్ధలాన్ని అయోధ్య ట్రస్ట్ ను ఏర్పాటు చేసి వారికీ అప్పగించాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఈ నెలాఖరు వరకు కేంద్రం ట్రస్ట్ ను ఏర్పాటు చేసి.. భూమిని అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. వచ్చే ఏడాది శ్రీరామ నవమి లోపుగాఅక్కడ కొంత నిర్మాణం పూర్తి చేయాలని రామ్ మందిర్ నిర్మాణ సంస్థలు నిర్ణయించినట్టు తెలుస్తోంది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)