అయోధ్య నగరంలో హై అలర్ట్.!

అయోధ్య నగరంలో హై అలర్ట్.!

అయోధ్య లో జరగనున్న రామమందిర భూమిపూజ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ఉగ్రవాదులు పథకం పన్నుతున్నారని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. దాంతో ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. అయోధ్య నగరంలో హై అలర్ట్ ను ప్రకటించింది. భూమిపూజ కార్యక్రమం సంధర్బంగా దాడులకు పాల్పడాలని పాకిస్థాన్ కు చెందిన ఐఎస్‌ఐ ఉగ్రవాద సంస్థలు లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ లకు ఆదేశాలు జారీ చేసినట్టు గుర్తించింది. దానికోసం ఉగ్రవాదులతో కూడిన ఓ బృందం పాకిస్తాన్‌ నుంచి భారత్‌లోకి చొరబడేందుకు వేచి చూస్తున్నట్లు అనుమానిస్తున్నాయి. దాంతో అప్రమత్తమైన యూపీ ప్రభుత్వం కట్టు దిట్టమైన చర్యలు తీసుకుంటుంది.  ఆగస్టు 5న జరగనున్న ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరుకానున్నారు. దాంతో ఆయన హెలికాఫ్టర్ దిగే స్థానం నుండి ఆయన ప్రయాణించే మార్గం లో ఇప్పటికే భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. చుట్టుపక్కల వారు ఆప్రాంతం లో ప్రయాణించాడనికి పాసులు జారీ చేసారు. పాసులు ఉన్నవారినే అనుమతిస్తున్నారు.