29న సుప్రీంకోర్టు ముందుకు అయోధ్య ఇష్యూ

29న సుప్రీంకోర్టు ముందుకు అయోధ్య ఇష్యూ

అయోధ్యలోని రాంమందిర్-బాబ్రీ మసీదు కు సంబంధించిన స్థల వివాదం ఈ నెల 29న చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ముందుకు వస్తోంది. ఈ ధర్మాసనంలో ఆయనతో పాటు ఎస్.కె.కౌల్, కె.ఎం.జోసెఫ్... ఈ కేసులో తదుపరి చర్యలను నిర్దేశిస్తారు. దీంతో సోమవారం జరిగే ఈ విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

సెప్టెంబర్ 27న అప్పటి సీజేఐ దీపక్ మిశ్రా, అశోక్ భూషణ్, అబ్దుల్ నజీర్ ల ధర్మాసనం 2:1 మెజారిటీతో పెద్ద బెంచ్ కు అప్పగించాల్సిన పని లేదని తీర్పు చెప్పింది. అలాగే తుదితీర్పు కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఈ కేసులో విచారణ త్వరగా పూర్తయ్యేలా... అక్టోబర్ 29 నుంచి రెగ్యులర్ గా విచారణ జరపాలని కూడా మిశ్రా ధర్మాసనం ఆదేశించింది.