అంతా రామ‌మ‌యం...! ఆస‌క్తిగా తిల‌కించిన ఇత‌ర దేశాలు

అంతా రామ‌మ‌యం...! ఆస‌క్తిగా తిల‌కించిన ఇత‌ర దేశాలు

అంతా రామ‌మ‌యం... ఈ జ‌గ‌మంతా రామ‌మ‌యం... అనే పాట వింటుంటే ఎంతో పుల‌కింత‌.. కోట్లాది మంది భార‌తీయుల‌ చిర‌కాల ‌వాంఛ అయోధ్య‌లో శ్రీ‌రాముడి ఆల‌య నిర్మాణం.. ఆ శ్రీ‌రామ‌చంద్ర‌మూర్తి ఆల‌య నిర్మాణానికి భూమిపూజ కార్య‌క్ర‌మం ఘ‌నంగా నిర్వ‌హించారు... ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.. క‌రోనా విజృంభిస్తోన్న స‌మ‌యంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి అతిత‌క్కువ మందిని ఆహ్వానించారు. ఇక‌, అయోధ్యలో జరిగిన భూమి పూజ కార్య‌క్ర‌మాన్ని భారత్‌లోని అశేష ప్రజానికం వీక్షించారు.. కేవలం భార‌త్‌లోనే కాదు.. మరో 15 దేశాల ప్రజలు కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. 

శ్రీ‌రాముడి ఆల‌య భూమిపూజ కార్య‌క్ర‌మాన్ని.. యూకే, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, థాయ్‌లాండ్, నేపాల్‌, ఓమన్, కువైట్, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్, మలేషియా, ఫిలిప్పైన్స్, సింగపూర్, శ్రీలంకతో పాటు మరిన్ని దేశాలు ఆ ప్రత్యక్ష ప్రసారాన్ని టీవీల్లో వీక్షించి పుల‌కించారు. అంతే కాదు.. డిజిట‌ల్ మీడియాలో మరి కొన్నిదేశాల్లో యూట్యూబ్ ద్వారా కూడా వీక్షించినట్టుగా చెబుతున్నారు. శ్రీ‌రాముడి భూమిపూజ కార్య‌క్ర‌మాన్ని ప్రత్యక్ష ప్ర‌సారాల‌ను ఏఎన్‌ఐ ద్వారా ఇతర ఛానెల్స్‌కు డిస్టిబ్యూట్ చేశారు. ఏఎన్‌ఐ ద్వారా దాదాపు 1200 స్టేషన్లకు పంపిణీ చేయగా, ఏపీటీఎన్ ద్వారా మరో 450 మీడియా సంస్థలకు.. డీడీ న్యూస్.. ఏసియా పసిఫిక్ దేశాల‌తో ఈ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారాన్ని పంచుకుంది. ఒక్క భారత్ లోనే 200 మీడియా సంస్థలు ఈ కార్యక్రమాన్ని లైవ్ తీసుకున్న‌ట్టు వెల్ల‌డించారు దూర‌ద‌ర్శ‌న్ అధికారులు. ఇక‌, డిజిట‌ల్ మీడియాలో మ‌రికొన్ని ఛానెల్స్ దీనికి అద‌నం.. ఇలా భూమి పూజా కార్య‌క్ర‌మ‌మే.. అంతా రామ‌మ‌యం అనేలా సాగింది.