బోటు వెలికితీత పనులు కొనసాగుతాయి...అందుకే నిలిపివేశాం !

బోటు వెలికితీత పనులు కొనసాగుతాయి...అందుకే నిలిపివేశాం !

కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన బోటును వెలికితీసే చర్యలు మళ్లీ కొనసాగుతాయని స్పష్టం చేశారు మంత్రి అవంతి శ్రీనివాస్. వరద ఉధృతి కారణంగా  బోటు వెలికితీత పనులు తాత్కాలికంగా నిలిపి వేశామని అవంతి శ్రీనివాస్‌ అంటున్నారు. బోటు ప్రమాదాన్ని ఇప్పటికీ కొందరు రాజకీయాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. విషాద ఘటనపై రాజకీయాలు వద్దన్నారు. తనకు బోటు ఉన్నట్లు నిరూపిస్తే దానిని రాసిచ్చేస్తానని అన్నారు. బోటు వెలికితీతపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని స్పష్టం చేశారు. బోటును బయటకు తీసే వరకూ మానవ ప్రయత్నాలు కొనసాగిస్తామని అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. గోదావరిలో పాపికొండల విహార యాత్ర గురించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం బృందం బోటును వెలికితీసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. వరద ఉధృతి కారణంగా  బోటు వెలికితీత పనులు తాత్కాలికంగా నిలిపి వేశారు.