జర్నలిస్ట్‌ స్టూడెంట్ గా అవికాగోర్‌

జర్నలిస్ట్‌ స్టూడెంట్ గా  అవికాగోర్‌

'ఉయ్యాలా జంపాలా’, ‘సినిమా చూపిస్త మావ’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అవికాగోర్‌ ఆ తరువాత సినిమాకు కాస్త బ్రేక్‌ తీసుకుంది. కెరీర్ మొదట్లో కాస్త బొద్దుగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య సన్నబడింది. ప్రస్తుతం అవికాగోర్‌ బల్‌వీర్‌ దర్శకుడిగా పరిచయం కాబోతున్న 'అమరన్‌ ఇన్‌ ది సిటీ చాప్టర్‌1' లో హీరోయిన్‌గా నటిస్తోంది. ఆదిసాయికుమార్‌తో సజ్జా వెంకటేశ్వరరావు నిర్మిస్తోన్న చిత్రం ఇది. ఈ చిత్రంలో అవికా జర్నలిస్ట్‌ పాత్రలో కనిపిస్తుంది. ఓ కేసుని జర్నలిస్ట్‌ స్టూడెంట్ గా అవికా శోధిస్తున్న సమయంలో ఆమెకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనేది సినిమా ప్రధాన కథాంశంగా తెలుస్తోంది.