టీడీపీ విరాళాలు మామూలే..

టీడీపీ విరాళాలు మామూలే..

వాస్తవానికి ప్రాంతీయ పార్టీలో ధనిక పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీకి 2017-18లో కేవలం కోటి 73 లక్షల రూపాయలు విరాళంగా అందాయి. ఈ ఏడాది జులై 11వ తేదీన పార్టీ ప్రధాన కార్యదర్శి ఇ పెద్దిరెడ్డి ఎన్నికల సంఘానికి రూ. 20,000లకు మించిన పార్టీ విరాళాల జాబితా అందించారు.  మొత్తం 83 మంది/సంస్థల నుంచి రూ. 1,73,71,922 అందినట్లు ఆయన తెలిపారు.  రూ. 25 లక్షలు ఇచ్చిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి అత్యధికంగా విరాళం ఇచ్చిన వ్యక్తిగా నిలిచారు. గోనుగుంట్ల వెంకట శివ సీతారామ ఆంజేయులు రూ. 11 లక్షలు,  గల్లా జయదేవ, బోళ్ల బుల్లిరామయ్య, దేవినేని అవినాశ్‌ రూ.10 లక్షలు చొప్పున విరాళం ఇచ్చారు.