పవన్ కల్యాణ్ క్షమాపణ చెప్పాలి..! ఏపీ మంత్రి డిమాండ్

పవన్ కల్యాణ్ క్షమాపణ చెప్పాలి..! ఏపీ మంత్రి డిమాండ్

గాజువాక ప్రజలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి అవంతి శ్రీనివాస్.. విశాఖలో మంత్రి అవంతి ఆధ్వర్యంలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ను స్వాగతిస్తూ వైసీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే విశాఖ ఎమ్మెల్యేతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. అసలు పుత్రుడు పనికిరాడని.. దత్తపుత్రుడిని రంగంలోకి దించారంటూ సెటైర్లు వేసిన మంత్రి అవంతి... ఇక, ఓట్ల కోసం గాజువాక... రాజకీయాల కోసం అమరావతి కావాల్సి వచ్చిందా? అంటూ పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించారు. గాజువాక నియోజకవర్గ ప్రజలకు పవన్ కల్యాణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన అవంతి.. విశాఖ రాజధాని ఉత్తరాంధ్ర హక్కుగా అభివర్ణించారు.