కరోనా ప్రచార రథాలను ప్రారంభించిన ఏపీ మంత్రి

కరోనా ప్రచార రథాలను ప్రారంభించిన ఏపీ మంత్రి

కరోనా ప్రచార రథాలను ఏపీ మంత్రి అవంతి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సంధర్భంగా మంత్రి మాట్లుడుతూ పోలీసులు ఎన్నో ఆటుపోటులు ఎదుర్కొని మనందరి రక్షణ కోసం రెయింబవళ్ళు పని చేస్తున్నారని, ఎంతో మంది కరోనా బారిన పడి ప్రాణాలు కూడా కోల్పోయారని అన్నారు. కరోనా పై అవగాహాన కొరకు ప్రచార రథాలు ప్రారంభించడం సంతోషకరమన్న ఆయన  సైబర్ క్రైమ్ ,ట్రాఫిక్ పై ఎప్పుటికపోపుడు ఈ వాహానాల ద్వారా సమాచారం ఇస్తారని అన్నారు. ప్రెండ్లీ పోలీసింగ్ మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్నారని, కరోనా పై దోపిడీ చేయాలని కొంతమంది ప్రయత్నాలు చేస్తుంటారని అటువంటి వారిపై మా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని అన్నారు. అలానే ఈ సమయంలో వైద్యులు మానవతా దృక్పథంతో సేవలందించాలని ఆయన కోరారు.