అయ్యప్ప దీక్షలో చెప్పులు.. ఎందుకో చెప్పిన అవంతి..

అయ్యప్ప దీక్షలో చెప్పులు.. ఎందుకో చెప్పిన అవంతి..

అయ్యప్ప మాల ధరించిన ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్.. చెప్పులు వేసుకోవడంపై విమర్శలు పెరిగాయి.. అలా చేయడం హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని విమర్శలు గుప్పించాయి ప్రతిపక్షాలు. అయితే.. ఈ వ్యవహారంపై వివరణ ఇచ్చారు మంత్రి అవంతి శ్రీనివాస్.. తన కంటే ఎక్కువగా హిందూ మతాన్ని ఎవరూ గౌరవించరన్న ఆయన.. ఆరోగ్య సమస్యలతోనే చెప్పులు వేసుకున్నట్లు స్పష్టం చేశారు. కుట్రలో భాగంగానే నాపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డ అవంతి.. డయాబెటిస్ ఉంది కాబట్టే చెప్పులు వేసుకుంటున్నానని క్లారిటీ ఇచ్చారు. ఇక, స్వామిమాలలో చెప్పులు వేసుకోవడం తప్పుకాదన్న ఆయన.. తాను టీడీపీ ఎంపీగా ఉన్న సమయంలోనూ మాల ధరించానని.. అప్పుడు కూడా చెప్పులు వేసుకున్నట్టు తెలిపారు. అయ్యప్ప మాలాలో ఉన్నప్పుడు మాజీ ఎంపీ మురళీమోహన్ కూడా చెప్పులు వేసుకున్నారని గుర్తు చేశారు మంత్రి అవంతి శ్రీనివాస్.