చందానగర్‌లో ఉద్రిక్తత..తండ్రి ఇంటివద్దకు వెళ్లేందుకు అవంతి యత్నం

చందానగర్‌లో ఉద్రిక్తత..తండ్రి ఇంటివద్దకు వెళ్లేందుకు అవంతి యత్నం

హైదరాబాద్‌ చందానగర్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది.  తన తండ్రి ఇంటిలోకి  హేమంత్‌ భార్య అవంతి యత్నించింది. దీంతో పోలీసులు ఆమెను అడ్డుకోవడంతో రోడ్డుపై బైటాయించింది. పరువు హత్యలను ఆపాలంటూ నినాదాలు చేసింది. అవంతి పోరాటానికి సీపీఐ నారాయణ సంఘీభావం తెలిపారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే హేమంత్‌ హత్య జరిగిందని నారాయణ ఆరోపించారు. నిందితులకు బెయిల్‌ ఇవ్వడానికి వీలు లేకుండా న్యాయవాదులు ముందుకురావాలన్నారు. లక్ష్మా రెడ్డితో పాటు హత్యలో పాల్గొన్న నిందితులను ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేసి తర్వాత శిక్షపడేలా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హేమంత్‌ కుటుంబానికి న్యాయం జరిగేంత తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.