ప్రగతి భవన్ ముందు ఆటోడ్రైవర్ ఆత్మహత్యాయత్నం... 

ప్రగతి భవన్ ముందు ఆటోడ్రైవర్ ఆత్మహత్యాయత్నం... 

హైదరాబాద్ లోని సీఎం క్యాంప్ ఆఫీస్ ముందు ఓ వ్యక్తి కలకలం సృష్టించాడు.  క్యాంప్ ఆఫీస్ మెయిన్ గేటు దగ్గర ఓ ఆటో డ్రైవర్ ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పు అంటించుకుని ప్రయత్నం చేశాడు.  అయితే, అప్రమత్తమైన పోలీసు సిబ్బంది అతడిపై నీళ్లు పోసి, ప్రాణాలు కాపాడారు.  సీఎం క్యాంప్ ఆఫీస్ ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  తెలంగాణ ఉద్యమ సమయంలో తాను చురుగ్గా పాల్గొన్నానని, 2010 వ సంవత్సరంలో అసెంబ్లీ ముందు కూడా తెలంగాణకోసం ఆత్మహత్య యత్నం చేసినట్టు తెలిపాడు.  తెలంగాణ వచ్చిన తరువాత తమ కష్టాలు తీరలేదని, ఇప్పటి వరకు ఇల్లు మంజూరు కాలేదని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి తెలిపాడు.