ఆస్ట్రేలియన్లు నా మీద జాతి వివక్ష వ్యాఖ్యలు చేయడం బాధించింది !

ఆస్ట్రేలియన్లు నా మీద జాతి వివక్ష వ్యాఖ్యలు చేయడం బాధించింది !

టీమిండియా పేసర్, హైదరాబాద్ క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌ ఆసీస్ పర్యటనలో తన ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నాడు. గబ్బా వేదికగా జరిగిన చివరి టెస్ట్ లో 5 వికెట్ హల్ సాధించిన సిరాజ్ పేస్ దళానికి నాయకుడిగా ముందుండి నడిపించాడు. అయితే టెస్ట్ సిరీస్ లో విజేతలుగా నిలిచిన ఇండియన్ టీం ఈరోజు తిరిగి భారత్ కు చేరుకుంది. సిరాజ్ కూడా ఈరోజు హైదరాబాద్ చేరుకున్నాడు. వచ్చి రాగానే  అతను తన తండ్రి సమాధిని దర్శించుకున్నాడు. అనంతరం ఆయన ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీమ్ ఇండియా విజయంలో నా పాత్ర వుండడం సంతోషాన్ని కలిగించిందని అన్నారు. నా అట తీరుపై అలాగే గెలుపు ఓటముల పై వుప్పొంగి పోనన్న ఆయన ఇండియాలో అడుగుపెట్టగానే తన తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించానని అన్నారు.

టెస్ట్ మ్యాచ్ అడడం ద్వారా నా తండ్రి కోరిక నెరవేర్చానని అన్నారు. చారిత్రాత్మక విజయంలో నా తండ్రి లేకపోవడం ఎంతగానో బాధిస్తోందని అన్నారు. రానున్న ఇంగ్లాండ్ టూర్ లో మంచి ప్రతిభ కనుబరిస్తే అదే జోష్ తో టీమ్ ఇండియా అద్బుతం చేస్తుందని అన్నారు. ఆస్ట్రేలియా టూర్లో తొలి వికెట్ తీయడం మర్చిపోలేనిదన్న సిరాజ్, ఆస్ట్రేలియా సిరీస్ లో తీసిన ప్రతి వికెట్ నా తండ్రికి అంకితం చేస్తున్నానని అన్నారు. క్రికెట్ లో అవినీతికి చోటు లేదు ప్రతిభ ఉంటే ఎవరైనా రాణించగలరని ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని ఇంటికి వచ్చినప్పుడు తల్లిని ఓదార్చడం కష్టంగా మారిందని అన్నారు.

హైదరాబాద్ రంజీ ట్రోఫీ ఆడే సమయంలో కెప్టెన్గా వ్యవహరించిన హనుమ విహారి సలహాలు ఎంతగానో దోహదపడ్డాయన్న ఆయన విరాట్ కోహ్లీ , అజింక్య రహానే కెప్టెన్సీ అద్భుతం అని అన్నారు. టీమిండియా సభ్యులు బూమ్రా పుజారా నటరాజ్ వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్ బుజం తట్టారని టీమ్ ఇండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ సలహాలు, సూచనలు బౌలింగ్ లోనూ ఫీల్డింగ్  అద్భుత ప్రదర్శన కనపరిచేలా చేశాయని అన్నారు. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఆస్ట్రేలియన్లు తనపై జాతి వివక్ష వ్యాఖ్యలు చేయడం బాధించిందని సిరాజ్ చెప్పుకొచ్చారు.