సాంగ్ తో ఎన్టీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన వార్నర్....

సాంగ్ తో ఎన్టీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన వార్నర్....

ఎన్టీఆర్ పుట్టినరోజున స్టార్స్ అందరూ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఎన్టీఆర్ తో దిగిన ఫోటోలను, ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ట్విట్టర్ లో పోస్ట్ లు చేస్తున్నారు.  అయితే, ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ వినూత్నంగా అలోచించి ఎన్టీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు.  జనతా గ్యారేజ్ సినిమాలోని నేను పక్కా లోకల్ సాంగ్ కు డేవిడ్ వార్నర్ స్టెప్స్ వేస్తూ టిక్ టాక్ చేసి దానిని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు.  

ఎన్టీఆర్ పుట్టినరోజున ఈ వీడియోను జత చేసి శుభాకాంక్షలు తెలిపారు.  ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.  లాక్ డౌన్ కావడంతో స్టార్స్ అందరూ ఇంటికే పరిమితం అవుతున్నారు.  అటు స్పోర్ట్స్ స్టార్స్ కూడా ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది.  ఎలాంటి ఆటలు లేకపోవడంతో ఇంట్లో ఇలా సాంగ్స్ చేస్తూ టిక్ టాక్ చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు.