తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా
నాలుగు టెస్టుల సిరీస్లో భాగంగా అడిలైడ్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ మురళీ విజయ్ (18; 53 బంతుల్లో) తక్కువ పరుగులకే పెవీలియన్ చేరాడు. 18.2 ఓవర్లో హ్యాండ్స్కోంబ్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ మాత్రం ఆచితూచి ఆడుతున్నాడు. క్రీజులో కేఎల్ రాహుల్ (44; 65 బంతుల్లో 3×4, 1×6), పుజారా(8; 24 బంతుల్లో 1×4, ) ఉన్నారు. ప్రస్తుతం 24 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి భారత్ 76 పరుగులు చేసింది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)