ధోని రికార్డు సమం

ధోని రికార్డు సమం

టెస్టుల్లో టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోని రికార్డును సమం చేసాడు. అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో పంత్‌ ఆరు క్యాచ్‌లను  అందుకున్నాడు. దీంతో ఒక టెస్టు మ్యాచ్‌.. ఒక ఇన్నింగ్స్‌లో ఆరు క్యాచ్‌లను అందుకున్న జాబితాలో ఎంఎస్‌ ధోని సరసన నిలిచాడు. షమీ బౌలింగ్ లో ఆసీస్‌ ఆటగాడు హజల్‌వుడ్‌ ఇచ్చిన క‍్యాచ్‌ను పంత్‌ పట్టుకోవడంతో ధోని రికార్డును సమం చేశాడు. పంత్ ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో.. ఖవాజా, హ్యాండ్స్‌కోంబ్‌, హెడ్,  పైనీ, స్టార్క్, హజల్‌వుడ్‌ల క్యాచ్ లు అందుకున్నాడు. ధోని 2009లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనతను సాధించాడు.