అడిలైడ్ టెస్టు: నిలిచిపోయిన ఆట
నాలుగు టెస్టుల సిరీస్లో భాగంగా అడిలైడ్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టుకు వరుణుడు అడ్డుపడ్డాడు. దీంతో మూడో రోజు ఆట ఆరంబమయిన కొద్దిసేపటికే నిలిచిపోయింది. ఓవర్నైట్ స్కోరు 191/7తో మూడో రోజు బ్యాటింగ్ కొనసాగించిన ఆసీస్ కు ఆదిలోనే షాక్ తగిలింది. మిచెల్ స్టార్క్ (15)ను బూమ్రా అవుట్ చేశాడు. అదే సమయంలో వర్షం పడడంతో అంపైర్లు మ్యాచ్ను నిలిపేశారు. ప్రస్తుతం ఆసీస్ 91.4 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. భారత్ మొదటి ఇన్నింగ్స్ స్కోరుకు ఆస్ట్రేలియా ఇంకా 46 పరుగులు వెనుకబడి ఉంది. మరో బ్యాట్స్ మెన్ ట్రావిస్ హెడ్ (66) క్రీజులో ఉన్నాడు. హేజిల్ వుడ్, నాథన్ లియాన్ లు ఉన్నారు. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 250 పరుగులు చేసిన విషయం తెలిసిందే.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)