మూడో రోజు ముగిసిన ఆట.. స్కోర్ 151/3

మూడో రోజు ముగిసిన ఆట.. స్కోర్ 151/3

అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌ మూడో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి టీమిండియా 61 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో ఆధిక్యాన్ని కలుపుకుని ప్రస్తుతం టీమిండియా 166 పరుగుల ఆధిక్యంలో ఉంది. మూడో రోజు రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్‌ మురళీ విజయ్‌ (18; 53 బంతుల్లో) తక్కువ పరుగులకే అవుట్ అయ్యాడు. రాహుల్ మాత్రం ఆచితూచి ఆడుతూ 44 (67 బంతుల్లో 3x4, 1x6) పరుగులు చేసి క్యాచ్ అవుట్ అయ్యాడు. వీరి నిష్క్రమణ అనంతరం టెస్ట్ స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా, కెప్టెన్ విరాట్ కోహ్లిలు భారీ షాట్లకు యత్నించకుండా ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్ ను నిలబెట్టారు. ఈ జోడి 71 పరుగుల బాగస్వామ్యంను నెలకొల్పింది. ఇక ఆట ముగుస్తుందనగా కోహ్లీ(34).. నాథన్ లియాన్ బౌలింగ్ లో క్యాచ్ అవుట్ అయ్యాడు. పుజారా (40), అంజిక్య రహానే (1) క్రీజ్ లో ఉన్నారు. ఆసీస్ బౌలర్లు స్టార్క్, హేజిల్ వుడ్, నాథన్ లియాన్ తలో వికెట్ తీశారు.

అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 191/7తో మూడో రోజు బ్యాటింగ్ కొనసాగించిన ఆసీస్‌.. 98.4 ఓవర్లలో 235 పరుగులు చేసి ఆలౌట్ అయింది. హెడ్‌ (72) అర్ధ సెంచరీ చేసాడు. భారత బౌలర్లలో అశ్విన్, బూమ్రా తలో మూడు వికెట్లు తీశారు. ఇక భారత్ తొలి ఇన్నింగ్స్ లో 250 పరుగులు చేసింది. చతేశ్వర్ పుజారా (123) సెంచరీ చేసాడు.