ఆసీస్ ఆలౌట్...

ఆసీస్ ఆలౌట్...

నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ ఆలౌట్ అయింది. ఆసీస్ 98.4 ఓవర్లలో 235 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో భారత్‌కు 15 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. ఓవర్‌నైట్ స్కోరు 191/7తో మూడో రోజు బ్యాటింగ్ కొనసాగించిన ఆసీస్‌ కు ఆదిలోనే షాక్ తగిలింది. మిచెల్ స్టార్క్‌ (15)ను బూమ్రా అవుట్ చేశాడు. అదే సమయంలో వర్షం పడడంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపేశారు. వర్షం తగ్గడంతో కొద్దిసేపటి తర్వాత మ్యాచ్ కొనసాగింది.

హెడ్, లియాన్ ల జోడి తొమ్మిదో వికెట్‌కు 31 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసింది. ఈ సమయంలో బౌలింగ్ కు వచ్చిన షమీ ఒకే ఓవర్లలో రెండు వికెట్లు తీసాడు. 99వ ఓవర్ మూడో బంతికి హెడ్‌(72)ను, నాలుగో బంతికి హజెల్‌వుడ్‌(0)ను అవుట్ చేయడంతో ఆసీస్ 235 పరుగులకు ఆలౌట్ అయింది. చివరకు లియాన్ 24 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఆసీస్ తరపున హెడ్ (72) అర్ధ సెంచరీ సాధించాడు. భారత బౌలర్లలో అశ్విన్, బూమ్రా తలో మూడు వికెట్లు తీశారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్ లో 250 పరుగులు చేసింది.