ఆసీస్ గడ్డపై కోహ్లీ మరో రికార్డు

ఆసీస్ గడ్డపై కోహ్లీ మరో రికార్డు

రికార్డులను తిరగరాయడమే లక్ష్యంగా పెట్టుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై 1000 పరుగులను కోహ్లీ పూర్తి చేసాడు. అడిలైడ్  వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో.. నాథన్ లియాన్ బౌలింగ్ (31.3 ఓవర్)లో సింగల్ తీయడంతో కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు. దీంతో ఆస్ట్రేలియా గడ్డపై 1000 పరుగులు పూర్తి చేసుకున్న నాలుగవ భారత బ్యాట్స్ మెన్ గా కోహ్లీ నిలిచాడు. ఈ జాబితాలో సచిన్ 1809 పరుగులతో మొదటి స్థానంలో ఉన్నాడు. లక్ష్మణ్ (1236), ద్రావిడ్ (1143) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఈ పర్యటనలో ఇంకా మూడు టెస్ట్ మ్యాచ్ లు ఉన్న నేపథ్యంలో లక్ష్మణ్, ద్రావిడ్ లను దాటే అవకాశాలు మెండుగా ఉన్నాయి.