ఆసీస్ ఇన్నింగ్స్ విజయం
రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆసీస్ పేసర్ కమిన్స్ (6/23) దాటికి రెండో ఇన్నింగ్స్‌లో లంక జట్టు 139 పరుగులకే ఆలౌటైంది. కమిన్స్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 10 వికెట్లు తీసాడు. మూడు రోజుల్లోనే ముగిసిన ఈ డేనైట్ టెస్టులో లంక రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 150 పరుగులు కూడా చేయలేకపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో 144 పరుగులకు, రెండో ఇన్నింగ్స్‌లో 139 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయం పాలైంది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 323 పరుగులు చేసింది. సొంత గడ్డపై టీమిండియా చేతిలో టెస్టు, వన్డే సిరీస్‌లు ఓడిన ఆస్ట్రేలియాకు ఈ విజయం కాస్త ఊరటనిచ్చేదే. రెండో టెస్టు వచ్చేనెల 1 నుంచి కాన్బెర్రాలో జరుగుతుంది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)