సెప్టెంబర్ లో ఆసీస్ ఇంగ్లాండ్ పర్యటన... మరి ఐపీఎల్...?

సెప్టెంబర్ లో ఆసీస్ ఇంగ్లాండ్ పర్యటన... మరి ఐపీఎల్...?

కరోనా విరామం తర్వాత ఇంగ్లాండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు అంతర్జాతీయ మ్యాచ్ లకు ఆతిథ్యం ఇస్తూ దూసుకపోతుంది. ఇప్పటికే ఇంగ్లాండ్ జట్టు వెస్టిండీస్ తో టెస్ట్ మ్యాచ్ సిరీస్ ముగించేసింది. ఇప్పుడు పాకిస్థాన్ తో ఆడుతున్న టెస్ట్ సిరీస్ లోనీ మొదటి మ్యాచ్ లో విజయం సాధించింది. అయితే పాకిస్థాన్ సిరీస్ పూర్తయిన తరువాత మళ్ళీ సెప్టెంబర్ లో ఆస్ట్రేలియా జట్టుకు ఆతిధ్యం ఇవ్వడానికి సిద్ధమైంది. అయితే ఈ పర్యటనకు గ్రీన్ సింగ్నల్ ఇచ్చిన ఆసీస్ 21 మంది ఆటగాళ్లతో కూడినతమ జట్టును ప్రకటించేసింది. అయితే ఈ పర్యటన కారణంగా ఆసీస్, ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఈ ఏడాది ఐపీఎల్ లో మొదటి కొన్ని మ్యాచ్ లు ఆడలేరు అని చెప్పాలి. ఎందుకంటే ఈ రెండు జట్ల మధ్య సౌథాంప్టన్ వేదికగా సెప్టెంబర్ 4, 6, 8న వరుసగా మూడు టీ20లు ఆ తర్వాత మాంచెస్టర్‌లో సెప్టెంబరు 11, 13, 16న మూడు వన్డేలు ఆడుతాయి. అందువల్ల సెప్టెంబర్ 19 నా ప్రారంభం కానున్న ఐపీఎల్ కోసం ఆటగాళ్లు 14 రోజులు క్వారంటైన్ లో ఉండాలి. ఆ సమయం లో చేసిన రెండు కరోనా పరీక్షలో నెగెటివ్ వస్తేనే వారు ఐపీఎల్ మ్యాచ్ లో పాల్గొంటారు. అంటే 16న చివరి వన్డే తర్వాత యూఏఈ కి వచ్చిన ఈ జట్ల ఆటగాళ్లు మొదటి 10 రోజులు ఐపీఎల్ లో పాల్గొనలేరనే చెప్పాలి.  

ఆస్ట్రేలియా జట్టు: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), సీన్ అబోట్, అష్టన్ అగర్, అలెక్స్ కారీ, పాట్ కమ్మిన్స్, జోష్ హాజిల్‌వుడ్, మార్కస్ లబుషేన్, నాథన్ లియోన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, రిలే మెరెడిత్, జోష్ ఫిలిప్, డేనియల్ సామ్స్, కేన్ రిచర్డ్సన్, స్టీవ్‌స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, ఆండ్రూ టై, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా