స్మిత్ ను వెనుకేసుకొచ్చిన ఆసీస్ కెప్టెన్...

స్మిత్ ను వెనుకేసుకొచ్చిన ఆసీస్ కెప్టెన్...

ఆసీస్-భారత్ మూడో టెస్ట్ చివరి రోజు మైదానంలో తప్పు చేస్తూ ఆతిధ్య జట్టు ఆటగాడు స్టీవ్ స్మిత్ అడ్డంగా దొరికిపోయాడు. అయితే నిన్న మ్యాచ్‌లో రెండో సెషన్‌ ముందు ఈ ఘటన చోటుచేసుకుంది. భారత ఆటగాడు రిషబ్ పంత్ మంచి ఫామ్‌లో ఆడుతున్న సమయంలో లంచ్ బ్రేక్ ఇచ్చారు. దాంతో ఇరు జట్ల ఆటగాళ్లు తమ తమ డ్రస్సింగ్ రూమ్స్‌కి చేరుకున్నారు. కానీ స్టీవ్ స్మిత్ మాత్రం మైదానంలోనే ఆగిపోయి బ్యాటింగ్ సమయంలో వికెట్ల వద్ద రిషబ్ పంత్ చేసుకున్న గార్డ్ మార్క్‌ను చెరిపేశాడు. ఇదంతా అక్కడి స్టంప్స్‌కి ఉన్న మెయిల్స్ కెమెరాలో చిక్కింది. దీంతో స్మిత్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఘటన పై ఆసియా కెప్టెన్ టీమ్ పైన్ స్పందిస్తూ స్మిత్ ను వెనుకేసుకొచ్చాడు. ఈ ఘటన పై పైన్ మాట్లాడుతూ... స్మిత్ ఆ పని కావాలని చేయలేదు. ఒకవేళ అతను నిజాంతః తప్పు చేసి ఉంటె భారత ఆటగాళ్లు మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేసేవారు. అయితే అలా చేయడం స్మిత్ కు అలవాటు... అతను అలా చేయడం నేను చాలాసార్లు చూసాను అని పైన్ తెలిపాడు. అయితే ఈ చర్య పై భారత మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్, మాజీ ఇంగ్లాండ్ ఆటగాళ్ళు డేవిడ్ లాయిడ్ మరియు మైఖేల్ వాఘన్ కూడా స్మిత్ ను విమర్శించారు.