బ్రేకింగ్ : ఏపీ మంత్రి పేర్ని నాని మీద మర్డర్ అటెంప్ట్

బ్రేకింగ్ : ఏపీ మంత్రి పేర్ని నాని మీద మర్డర్ అటెంప్ట్

ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్నినాని మీద మర్డర్ అటెంప్ట్ జరిగింది. మచిలీపట్నంలో ఉన్న ఆయన నివాసం వద్ద గుర్తు తెలియని వ్యకి ఇళ్ళు కట్టే తాపీతో దాడి చేశాడని అంటున్నారు. ఈ క్రమంలో మంత్రి నాని తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారని అంటున్నారు. వెంటనే నిందితుడిని పట్టుకున్నఅనుచరులు ఆయన్ని పోలీసులకు అప్పగించారు. ఈ దాడిలో మంత్రి చొక్కా పూర్తిగా చినిగిపోయిందని అంటున్నారు. పోలీసులు నిందితుడి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. అయితే గతంలో మంత్రి అనుచరుడు మోకా భాస్కర రావు మీద హత్యాప్రయత్నం జరగగా ఆయన అక్కడిక్కడే మృతి చెందారు. ఈ క్రమంలో మంత్రి మీద హత్య ప్రయత్నం చేయడం కలకలం రేగుతోంది.  కాళ్లకు దండం పెట్టడానికి ఒంగుని మంత్రిపై దాడి చేశాడు నిందితుడు. మంత్రి నాని చొక్కా కూడా చినిగింది. వెంటనే నిందితుడిని పట్టుకున్న అనుచరులు పోలీసులకు అప్పగించారు. దాడి చేసిన వ్యక్తి తాపీమేస్త్రి బడుగు నాగేశ్వరరావుగా గుర్తించారు. నిందితుడు మద్యం మత్తులో ఉన్నట్టు చెబుతున్నారు.