లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌.. అట్లాస్‌ సైకిళ్ల కంపెనీ మూత..!

లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌.. అట్లాస్‌ సైకిళ్ల కంపెనీ మూత..!

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తున్న తరుణంలో.. భారత్‌లో నివారణ చర్యల్లో భాగంగా లాక్‌డౌన్‌ విధించింది కేంద్ర ప్రభుత్వం.. దీంతో.. మార్చి 25 నుంచి అత్యవసర సేవలు, నిత్యావసరాలు మినహా అన్నీ మూతపడ్డాయి.. ఇక, లాక్‌డౌన్‌ ప్రత్యక్షంగా, పరోక్షంగా చాలా సంస్తలపై ప్రభావం చూపుతూనే ఉంది.. లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌తో ప్రముఖ సైకిళ్ల తయారీ సంస్థ అట్లాస్ తాత్కాలికంగా లేఆఫ్ ప్రకటించింది. యూపీలోని సహిబాబాద్‌లో ఉన్న అట్లాస్ సైకిళ్ల తయారీ కర్మాగారంలో ఉద్యోగాలకు కంపెనీ తాత్కాలికంగా లే ఆఫ్ ప్రకటించింది ఆ సంస్థ.. ఈ ప్లాంటులో నెలకు రెండు లక్షల సైకిళ్ల వరకు ఉత్పత్తి చేస్తుంటారు.. వారం రోజుల క్రితం ఉద్యోగులను విధులకు రావాలని కోరిన సంస్థ.. అంతలోనే లేఆఫ్ ప్రకటించి ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. ఈ నిర్ణయంపై కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 700కు పైగా కార్మికులు ఉపాధి కోల్పోయారు.. ఇక, అంతర్జాతీయ సైకిల్ దినోత్సవం రోజునే ఈ ప్రకటన చేసి.. కార్మికులకు షాక్ ఇచ్చింది అట్లాస్.