రివ్యూ: అతడే శ్రీమన్నారాయణ 

రివ్యూ: అతడే శ్రీమన్నారాయణ 

నటీనటులు: రక్షిత్‌ శెట్టి,శాన్వీ శ్రీవాస్తవ,అచ్యుత్‌ కుమార్‌,బాలాజీ మనోహర్‌,ప్రమోద్‌ శెట్టి తదితరులు 

మ్యూజిక్: చరణ్ రాజ్ 

సినిమాటోగ్రఫీ: కర్న్ చావ్లా 

దర్శకత్వం: సచిన్ రవి 

గత కొంతకాలంగా పాన్ ఇండియా సినిమాల హవా కొనసాగుతోంది.  పాన్ ఇండియా సినిమాలు చేయడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు.  పాన్  ఇండియా సినిమా అంటే ప్రతి ఒక్కరు ఇష్టపడుతున్నారు.  బాహుబలి తరువాత ఈ క్రేజ్ పెరిగింది.  కన్నడంలో వచ్చిన కేజీఎఫ్, పహిల్వాన్ సినిమాలు కూడా పాన్ ఇండియా మూవీస్ గా మెప్పించాయి.  ఇప్పుడు ఇదే ఊపుతో రక్షిత్ శెట్టి హీరోగా అతడే శ్రీమన్నారాయణ సినిమా వచ్చింది.  మరి ఈ మూవీ ఎంతవరకు ఆకట్టుకుందో చూద్దామా.. 

కథ: 

అమరావతి నగరంలో ఈ సినిమా ప్రారంభం అవుతుంది.  అమరావతిలో అభిరుల వంశం ఉంటుంది.  ఈ వంశానికి చెందిన జయరామ, తుకారామ అనే ఇద్దరు సవతి కొడుకుల మధ్య అభిరుల కోట, రహస్య నిధి గురించి పోరాటం జరుగుతుంది.  ఈ నిధిని దక్కించుకోవడానికి ఈ ఇద్దరు చూస్తుంటారు.  ఆ నిధి రహస్యం వాళ్లకు తెలుసు కానీ దక్కించుకోలేరు.  ఇదిలా ఉంటె, 15 ఏళ్ల తరువాత వీరి మధ్యకు పోలీస్ ఆఫీసర్ రక్షిత్ శెట్టి వస్తాడు.  అలా వచ్చిన రక్షిత్ ఆ నిధి రహస్యాన్ని ఎలా తెలుసుకున్నాడు?  అక్కడి ప్రజలకు ఎలా విముక్తి కల్పించాడు అన్నది కథ.  

విశ్లేషణ: 

విభిన్న కోణంలో, కొత్త జానర్ తో వచ్చే చిత్రాలను ప్రేక్షకులు  ఆదరిస్తున్నారు.  అది ఏ భాషలో వచ్చిన సినిమా అయినప్పటికీ అన్ని భాషల వాళ్ళు ఆదరిస్తున్నారు.  అలా వచ్చిన సినిమానే అతనే శ్రీమన్నారాయణ.  పురాణాల్లోకి కౌబాయ్ లాంటి పాత్ర ప్రవేశిస్తే ఎలా ఉంటుంది అనే కోణంలో సినిమా సాగుతుంది.  పురాణాల్లో బందిపోటుల వంశం ఉంటుంది.  వాళ్ళ మధ్యలోకి పోలీస్ పాత్ర ఎంటర్ అవుతుంది.  ఎలా అక్కడి ఎంటర్ అవుతుంది.  కథ ఏ కాలానికి చెందింది అన్నది ముఖ్యం కాదు.  ఎందుకంటే ఇది ఫిక్షన్ సినిమా.  ఈ జానర్లో కూడా ఇది కొత్తరకం సినిమా కాబట్టి ఇక్కడ అవి ముఖ్యం కాదు.  అలా ఎంటర్ అయిన పోలీస్ ఆఫీసర్ తన చమత్కారంతో ఆకట్టుకుంటాడు.  నిధి రహస్యానికి ఉన్న చిన్న ఆధారాన్ని సేకరిస్తారు.  అక్కడి నుంచి ఆ నిధిని ఎలా సొంతం చేసుకున్నారు అనే కోణాన్ని చాలా చక్కగా చూపించారు.  ప్రేక్షకులను కథలో లీనం చేస్తుంది.  ఒక పాన్ ఇండియా సినిమాకు కావలసిన అన్ని అర్హతలు సినిమాలో ఉన్నాయి.  కథనాలు ఆకట్టుకున్నాయి. 

అయితే, సినిమా నిడివి పెద్దదిగా ఉండటంతో అక్కడక్కడా సాగదీసినట్టుగా ఉంటుంది.  అంతకు మించి మిగతా అంతా ఆకట్టుకుంది.  ఇలాంటి సినిమాలు చాలా తక్కువగా వస్తుంటాయి.  మొత్తానికి కన్నడం నుంచి వచ్చిన ఈ సినిమా ఆకట్టుకుంది.  ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ లు సినిమాకు ప్లస్ అయ్యాయి.  

నటీనటుల పనితీరు: 

హీరో రక్షిత్ శెట్టి సినిమాను తన భుజాన వేసుకొని నడిపించారు.  నారాయణ అనే పోలీస్ ఆఫీస్ పాత్రలో పండించిన హాస్యం, ప్రదర్శించిన సాహసాలు సూపర్ అని చెప్పాలి.  ఇక శాన్వి పాత్ర తక్కువే అయినా ఆకట్టుకుంది.  కానిస్టేబుల్ గా చేసిన అచ్యుత్ సినిమాలో హైలైట్ అయ్యాడు.  ఇందులో చాలామంది రంగస్థల కళాకారులు నటించి మెప్పించారు.  

సంకేతికవర్గం పనితీరు: 

ఫాంటసీ సినిమా కావడంతో దానికి తగ్గట్టుగా పాత్రలను తీర్చిదిద్దిన తీరు ఆకట్టుకుంది.  సచిన్ తన దర్శకత్వంతో ఆకట్టుకున్నాడు.  కథను నడిచిన విధానం సినిమాకు హైలైట్ అయ్యింది.  ఫాంటసీ సినిమాలకు ఫొటోగ్రఫీ చాలా ముఖ్యం.  ఇందులో ఫొటోగ్రఫీ సూపర్ అని చెప్పాలి.  మ్యూజిక్ కూడా బాగుంది.  

పాజిటివ్ పాయింట్స్: 

రక్షిత్ 

కథ

కథనాలు 

ఫొటోగ్రఫీ 

మ్యూజిక్ 

నెగెటివ్ పాయింట్స్: 

నిడివి 

బలమైన ప్రతినాయకులు లేకపోవడం 

చివరిగా: కొత్తగా కనిపించిన అతడే శ్రీమన్నారాయణ