పరిషత్ ఎన్నికలపై చంద్రబాబు నిర్ణయమే ఫైనల్... 

పరిషత్ ఎన్నికలపై చంద్రబాబు నిర్ణయమే ఫైనల్... 

ఏపీలో పరిషత్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ను ఇప్పటికే ఎస్ఈ సి రిలీజ్ చేసింది.  ఈనెల 8 న ఎన్నికలు, 10 న ఫలితాలు ఉంటాయి.  అయితే, దీనిని సవాల్ చేస్తూ వివిధ పార్టీలు హైకోర్టును ఆశ్రయించాయి.  దీనిపై నేడు విచారణ జరుగుతున్నది.  ఇక ఇదిలా ఉంటె, పరిషత్ ఎన్నికలకు దూరంగా ఉండాలని చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.  బాబు నిర్ణయాన్ని కొంతమంది టీడీపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు.  ఎన్నికల్లో పోటీ చేసి తీరుతామని నేతలు చెప్తుండటంపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు.  పరిషత్ ఎన్నికలపై చంద్రబాబు నిర్ణయమే ఫైనల్ అని అన్నారు.  ఒకరిద్దరు నేతలు వ్యతిరేకించినా దానిని పరిగణలోకి తెసుకోవాల్సిన అవసరం లేదని, కుప్పం సహా కొన్ని చోట్ల కొందరికి ఇది నచ్చకపోవచ్చని, అధినేత నిర్ణయాన్ని అందరూ పాటించాలని అన్నారు. వైసీపీ నేతలు గతంలో చాలా ఎన్నికలకు దూరంగా ఉన్నారని, ఓటమి భయంతో వైసీపీ చాలాసార్లు పోటీ చేయనేలేదని తెలిపారు.