ఆసుస్ జెన్‌ఫోన్6 పేరుతో ఓ సరికొత్త మొబైల్
తైవాన్‌కు చెందిన ప్రముఖ మొబైల్ఫోన్ల తయారీ సంస్థ ఆసుస్ జెన్‌ఫోన్6 పేరుతో ఓ సరికొత్త మొబైల్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న పాప్ అప్ కెమెరా కలిగిన ఫోన్లకు భిన్నంగా ఆసుస్ ఫ్లిప్ కెమెరాతో ఈ మొబైల్‌ను తీసుకువచ్చింది. వెనుకవైపు ఉన్న కెమెరానే సెల్ఫీలు తీసుకునేటప్పుడు ముందుకు తిరుగుతుంది. దీని ధరను 499 యూరోలుగా నిర్ణయించారు. భారత కరెన్సీలో సుమారు రూ.39,000. త్వరలోనే భారత్‌లోనూ ఈ ఫోన్‌ను విడుదల చేయనున్నారు. వన్‌ప్లస్ 7కు పోటీగా దీన్ని తీసుకురానున్నట్లు సమాచారం.
ప్రత్యేకతలుః
* 6.4అంగుళాల ఫుల్హెచ్డీ డిస్ప్లే
* స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్
* 6జీబీ/8జీబీ ర్యామ్‌లతో పాటు, 64జీబీ, 128జీబీ, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
* వెనుకవైపు 48మెగాపిక్సెల్ కెమెరా, 13మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా
* సెల్ఫీలు తీసుకునే సమయంలో ఇది వెనుక నుంచి పైకి లేచి, ముందుకు టర్న్ అవుతుంది
* 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం
* క్విక్ ఛార్జింగ్ 4.0కు సపోర్ట్
* జెన్‌యూఐ6, ఆండ్రాయిడ్ ‘పై’తో ఇది పనిచేస్తుంది
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)