జనవరి 28, గురువారం దినఫలాలు 

జనవరి 28, గురువారం దినఫలాలు 

మేషం : మీ ఉన్నతి కొంతమందికి అపోహ కలిగిస్తుంది. రావలసిన ధనంలో కొంత మొత్తం అందుతుంది. ఉపాధ్యాయులకు విద్యార్థుల మొండివైఖరి చికాకు కలిగిస్తుంది. విదేశీయాన యత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కొంటారు. రాజకీయ నాయకులు అప్రమత్తంగా ఉండాలి. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు.

వృషభం : మీ అభిప్రాయాలను కుటుంబీకులు గౌరవిస్తారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆలోచనలు కార్యూపం దాల్చుతాయి. అనుకున్నది సాధిస్తారు. సోదరులతో కలహాలు చోటు చేసుకుంటాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. పరిచయాలు బలపడతాయి. ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు.

మిథునం : ఉమ్మడి వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీల్లో ఏకాగ్రత అవసరం. ఓర్పు, శ్రమాధిక్యతతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. రవాణా రంగాల వారికి ప్రయాణికులతో ఇబ్బందులను ఎదుర్కొంటారు. వైద్య రంగాల వారికి ఆపరేషన్ల సమయంలో ఏకాగ్రత ముఖ్యం. కొబ్బరి, పండ్లు, పూల, తమలపాకుల వ్యాపారులకు లాభదాయకం.

కర్కాటకం : శత్రువులపై జయం పొందుతారు. వ్యాపారాలలో ధనం లాభిస్తుంది. స్త్రీలకు చుట్టుపక్కల వారి నుంచి కొత్త సమాచారం అందుతుంది. ద్విచక్రవాహనాలపై దూర ప్రయాణాలు ఇబ్బందులకు దారితీస్తాయి. విద్యుత్ బిల్లులు, పెరిగిన ధరలు ఆందోళన కలిగిస్తాయి. చెల్లింపులు, బ్యాంకు వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం.

సింహం : రాబోయే కాలంలో ఖర్చులు, అవసరాలు మరింతగా పెరిగేందుకు ఆస్కారం ఉంది. విదేశీయత్నాలలో కొన్ని అవాంతరాలు ఎదురైనా విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారాలు వాయిదాపడటం మంచిది. కుటుంబీకుల కోసం ధన విరివిగా వ్యయం చేయాల్సి ఉంటుంది. విద్యార్థినులకు ప్రేమ వ్యవహారాల్లో చుక్కెదురవుతుంది.

కన్య : దంపతుల మధ్య కలహాలు తొలగి ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ప్రయాణ రీత్యా ధన వ్యయం. మానసిక ప్రశాంతత కరువగును. ఏదైనా అమ్మకానికై చేయు ఆలోచన వాయిదా వేయడం మంచిది. స్త్రీలకు తల, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. ఇతరులపై ఆధారపడక స్వయంకృషినే నమ్ముకోవడం శ్రేయస్కరం.

తుల : శాస్త్ర సంబంధంమైన విషయాలు ఆసక్తిని చూపుతాయి. సేల్స్ సిబ్బందికి కొనుగోలుదార్లను ఓ కంట కనిపెట్టండి. బంధు మిత్రులతో కాలక్షేపం చేస్తారు. కొత్త ఆలోచనలతో భవిష్యత్ నిర్ణయాలు తీసుకుంటారు. స్త్రీలకు పనివారితో సమస్యలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. ఉపాధ్యాయులకు అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.

వృశ్చికం : మీ అత్యుత్సాహం అనర్థాలకు దారితీస్తుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి మందకొడిగా ఉంటుంది. విద్యార్థులకు తోటివారి వల్ల మాటపడవలసి వస్తుంది. పాత రుణాలు తీర్చడంతో పాటు విలువైన పరికరాలు అమర్చుకుంటారు. ఆహ్వానాలు, గ్రీంటింగులు అందుకుంటారు. మాట్లాడలేనిచోట మౌనం వహించండి మంచిది.

ధనస్సు : బ్యాంకు వ్యవహారాల్లో మెళకువ వహించండి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలకు సంబంధించిన సమాచారం అందిస్తారు. బదిలీలు, మార్పులు, చేర్పుల గురించి ఓ నిర్ణయం తీసుకుంటారు. ఒక వ్యవహారం నిమిత్తం దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. మీ అభిరుచికి తగిన వ్యక్తితో పరిచయాలు ఏర్పడతాయి.

మకరం : స్త్రీ కారణంగా చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. విద్యా, సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. రాజకీయ రంగాల వారికి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. చిన్నారుల మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. వైద్యులు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేస్తారు.

కుంభం : గృహ నిర్మాణాలు, మరమ్మతులు చురుకుగా సాగుతాయి. బ్యాంకు వ్యవహారాలలో ఏకాగ్రత వహించండి. అంతగా పరిచయం లేనివారికి ధనసహాయం చేసే విషయంలో అప్రమత్తత అవసరం. నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. సద్వినియోగం చేసుకోండి. ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి.

మీనం : ప్రియతములు ఇచ్చే సలహా మీకు ఎంతో సంతృప్తినిస్తుంది. మనోధైర్యంతో మీ యత్నాలు కొనసాగించండి. కొంతమంది సూటిపోటి మాటలుపడటం వల్ల మానసిక ఆందోళనకు గురవుతారు. దైవ, సేవా కార్యక్రమాలు ఇతోధికంగా సహకరిస్తాయి. స్త్రీలకు టీవీ చానెళ్ల నుంచి ఆహ్వానం, కానుకలు అందుతాయి.